కేటీఆర్! రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నావు... ఇక రేపటి నుంచి కాస్కో: మైనంపల్లి హన్మంతరావు

24-09-2024 Tue 17:27 | Telangana
Advertisement
  • బీఆర్ఎస్‌లో ఉన్నవాళ్లు ఇవాళో... రేపో కాంగ్రెస్‌లోకి వస్తారన్న మైనంపల్లి
  • పార్టీలకు అతీతంగా అరికెపూడి గాంధీ అంటే తనకు ఇష్టమని వ్యాఖ్య
  • అధికారం కోల్పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారని విమర్శ
Advertisement
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు... ఇక రేపటి నుంచి ఉంటుంది కాస్కో అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళు ఇవాళో... రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్నారు. ఆ పార్టీలో ఉన్నవారిని ఏమీ అనవద్దు... వారు కూడా మనవారేనని వ్యాఖ్యానించారు.

పార్టీలకు అతీతంగా అరికెపూడి గాంధీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.10 కోట్లు ఇచ్చి  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. కానీ గాంధీ మాత్రం ఒక్క రూపాయి ఆశించకుండా నాడు బీఆర్ఎస్‌లో చేరారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగాయని, ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోగానే తెలంగాణ, ఆంధ్రా అంటూ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సచివాలయాన్ని కూల్చి బీఆర్ఎస్ వాళ్లు నిధులు దోచుకున్నారని ప్రచారం ఉందని, ఈరోజు ఆ సచివాలయంలో అన్నీ లీకులు అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ వాళ్లది క్రిమినల్ మైండ్ అని విమర్శించారు.
Advertisement
Mynampalli Hanumantha RaoTelanganaCongressRevanth Reddy

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more